రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ఉగాది పండుగ ముందే వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమమే ధ్యేయంగా...

By -  అంజి
Published on : 13 March 2026 6:02 PM IST

Annadata Sukhibhava 3rd Installment 2026, Chandrababu Naidu Fund Release Gannavaram, AP Farmer Financial Assistance ₹20,000, PM Kisan 22nd Installment Andhra Pradesh, Status Check Annadata Sukhibhava Aadhaar

రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ఉగాది పండుగ ముందే వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమమే ధ్యేయంగా 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' మూడో విడత నిధులను శుక్రవారం (మార్చి 13, 2026) విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా లభించింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.85 లక్షల మంది రైతులు ఉండగా.. ప్రతి రైతు ఖాతాలో ₹6,000 జమ అయ్యాయి. ఈ ₹6,000 మొత్తంలో కేంద్ర ప్రభుత్వం వాటా (పీఎం కిసాన్ 22వ విడత) ₹2,000 కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా ₹4,000 గా ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి ₹20,000 సాయం అందిస్తామని ప్రకటించింది. తాజా విడుదల చేసిన మూడో విడతతో కలిపి ఈ ఏడాదికి ఇచ్చిన ₹20,000 హామీని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.

గత విడతల వివరాలు:

ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతల్లో నిధులను పంపిణీ చేసింది:

మొదటి విడత: ఆగస్టు 2, 2025న ₹7,000 (రాష్ట్రం ₹5000 + కేంద్రం ₹2000).

రెండో విడత: నవంబర్ 19, 2025న ₹7,000 (రాష్ట్రం ₹5000 + కేంద్రం ₹2000).

మూడో విడత: మార్చి 13, 2026న ₹6,000 (రాష్ట్రం ₹4000 + కేంద్రం ₹2000).

మీ అకౌంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ సదుపాయం కల్పించింది.

- అధికారిక వెబ్‌సైట్: ముందుగా annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

- Know Your Status: హోమ్ పేజీలో ఉన్న 'Know Your Status' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

- ఆధార్ నంబర్: మీ 12 అంకెల ఆధార్ నంబర్ మరియు అక్కడ కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.

- వివరాలు: 'Get Details' లేదా సెర్చ్ బటన్ నొక్కితే మీ పేమెంట్ సక్సెస్ అయిందో లేదో, ఏ బ్యాంకులో పడ్డాయో పూర్తి వివరాలు కనిపిస్తాయి.

- ఒకవేళ ఈకేవైసీ (e-KYC) పెండింగ్‌లో ఉన్నా లేదా ఆధార్ లింకింగ్ సమస్యలు ఉన్నా డబ్బులు జమ కావు. అటువంటి వారు వెంటనే తమ సమీక్ష సచివాలయాన్ని లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

Next Story