ర‌థోత్స‌వంలో అప‌శ్రుతి.. విద్యుత్ షాక్‌తో ఇద్ద‌రు మృతి

Two people died with electricshock in chintalamuni chariot festival.క‌ర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆధోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2021 7:24 AM GMT
ర‌థోత్స‌వంలో అప‌శ్రుతి.. విద్యుత్ షాక్‌తో ఇద్ద‌రు మృతి

క‌ర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆధోని మండ‌లం పెస‌ల‌బండ‌లో నిర్వ‌హించిన మునిస్వామి ర‌థోత్స‌వంలో అప‌శ్రుతి చోటుచేసుకుంది. ర‌థోత్స‌వంలో పాల్గొన్న ఇద్ద‌రు భ‌క్తులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. మ‌రో 8 మంది భ‌క్తుల‌కు గాయాల‌య్యాయి. బుధ‌వారం ఉద‌యం ర‌థోత్స‌వం నిర్వ‌హిస్తుండ‌గా.. ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గితాయి.

దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో 8 మంది వ‌ర‌కు గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని వెంట‌నే స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృతుల‌నే అదే గ్రామానికి చెందిన వీరాంజ‌నేయులు, వెంక‌టేశులుగా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

Next Story
Share it