విషాదం.. స్కాట్లాండ్‌లో నీట మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

స్కాట్లాండ్‌లోని పర్యాటక ప్రదేశంలో హైదరాబాదీ సహా ఇద్దరు భారతీయ విద్యార్థులు నీట మునిగి చనిపోయారు.

By అంజి  Published on  19 April 2024 5:45 AM GMT
Indian student, Hyderabadi, tourist spot, Scotland

విషాదం.. స్కాట్లాండ్‌లో నీట మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

స్కాట్లాండ్‌లోని పర్యాటక ప్రదేశంలో హైదరాబాదీ సహా ఇద్దరు భారతీయ విద్యార్థులు నీట మునిగి చనిపోయారు. స్కాట్లాండ్‌లోని ప్రముఖ సందర్శనా స్థలంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలో చనిపోయారు. లిన్ ఆఫ్ టుమ్మెల్ వద్ద నీటి నుండి అత్యవసర సేవల ద్వారా ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.

వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందినవారు. డూండీ విశ్వవిద్యాలయంలో నలుగురు భారతీయ విద్యార్థులు కలిసి ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు నీటిలో పడి మునిగిపోయారు. మరణించిన ఇద్దరు 22, 27 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు డూండీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేస్తున్నారు. జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22).. బుధవారం సాయంత్రం పిట్లోచ్రీకి ఉత్తరాన ఉన్న లిన్ ఆఫ్ టుమ్మెల్ వద్ద గల్లంతయ్యారు.

మృతుల చుట్టూ ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు చెబుతున్నారు. లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. "బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. వారి మృతదేహాలు కొద్దిగా దిగువకు లభ్యమయ్యాయి. భారత కాన్సులేట్ జనరల్ ఇరువురి కుటుంబాలతో టచ్‌లో ఉన్నారు. కాన్సులర్ అధికారి యూకేలో నివసిస్తున్న ఒక విద్యార్థి యొక్క బంధువును కలుసుకున్నారు, పోస్ట్‌మార్టం ఏప్రిల్ 19న జరుగుతుందని, ఆ తర్వాత మృతదేహాలను స్వదేశానికి తీసుకురావాలని భావిస్తున్నారు" అని పేర్కొన్నారు.

Next Story