తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!

శ్రీవారి దర్శనం కోసం దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు తిరుమలలోని వసతి గృహాల్లో ఇకపై అదనపు సౌకర్యాలు సులభంగా అందనున్నాయి.

By -  అంజి
Published on : 15 March 2026 7:54 AM IST

TTD Accommodation Services, Tirumala Guest Houses, Nandakam Rest House, Nandini, Panchajanyam, Kaustubham, TTD New Rules, Tirumala Pilgrims Comfort, Blanket and Pillow Rent TTD

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!  

శ్రీవారి దర్శనం కోసం దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు తిరుమలలోని వసతి గృహాల్లో ఇకపై అదనపు సౌకర్యాలు సులభంగా అందనున్నాయి. సాధారణంగా గదిలో కేటాయించిన బెడ్లు కాకుండా, అదనంగా వచ్చే చిన్న పిల్లలు లేదా వృద్ధుల కోసం దిండ్లు, దుప్పట్లు, చాపల అవసరం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే భక్తుల ఇబ్బందులను గమనించిన టీటీడీ, చాలా తక్కువ అద్దెకే వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఈ సేవలను 'నందకం' అతిథి గృహంలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. భక్తుల నుంచి వస్తున్న సానుకూల స్పందన దృష్ట్యా, త్వరలోనే వీటిని వకుళమాత, పాంచజన్యం, కౌస్తుభం వంటి ప్రధాన వసతి సముదాయాలకు కూడా విస్తరించనున్నారు. వేసవి కాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, గదుల్లో అదనపు సౌకర్యాలు భక్తులకు ఎంతో మేలు చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.

ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

ఒక దుప్పటి: ₹10 మాత్రమే

రెండు దిండ్లు: ₹10 మాత్రమే

ఒక చాప: ₹10 మాత్రమే

ఒక రగ్గు: ₹20 మాత్రమే

అవసరమైన భక్తులు తాము బస చేస్తున్న వసతి గృహంలోని రిసెప్షన్ కౌంటర్ వద్దకు వెళ్లి, నిర్ణీత అద్దె చెల్లించి వీటిని పొందవచ్చు. బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎక్కువ ధరలు చెల్లించకుండా, టీటీడీ నేరుగా అందిస్తున్న ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Next Story