TTD: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

మే నెలకు సంబంధించి శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

By అంజి  Published on  18 Feb 2025 6:53 AM IST
TTD, Tirumala Srivaru, Arjitha Seva Tickets

TTD: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

అమరావతి: మే నెలకు సంబంధించి శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్ఠదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో భక్తులు రిజిస్టర్‌ చేసుకోవచ్చు. వాటి చెల్లింపులను ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.

ఫిబ్రవరి 21న మ.3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్లకు సంబంధించినన మే నెల‌ కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. మే నెల గదుల కోటాను టీటీడీ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

Next Story