మూడు క్యాన్సర్‌లు, ఒక విజయగాథ
లించ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రోగిలో మూడు మెటాక్రోనస్ క్యాన్సర్ లకు సంబంధించిన అరుదైన, సంక్లిష్టమైన కేసు కు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), మంగళగిరి, విజయవాడ విజయవంతంగా చికిత్స చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Feb 2025 4:00 PM IST
లించ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రోగిలో మూడు మెటాక్రోనస్ క్యాన్సర్ లకు సంబంధించిన అరుదైన, సంక్లిష్టమైన కేసు కు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), మంగళగిరి, విజయవాడ విజయవంతంగా చికిత్స చేసింది. లించ్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైన పరిస్థితి, ఇది ఒక వ్యక్తికి కొన్ని క్యాన్సర్‌లు, ముఖ్యంగా పెద్దప్రేగు, గర్భాశయం, అండాశయం, ఉదరం మరియు ఇతర క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలోని DNA లోపాలను పరిష్కరించాల్సిన జన్యువులలో పరివర్తన కారణంగా ఇది జరుగుతుంది. ఈ జన్యువులు సరిగ్గా పనిచేయనప్పుడు, దెబ్బతిన్న కణాలు అనియంత్రితంగా పెరుగుతాయి, ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది.
రోగి, ఎస్.డి ., మొదట రొమ్ము క్యాన్సర్‌తో బారిన పడ్డారని గుర్తించటం జరిగింది. చికిత్స లో భాగంగా ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు, తరువాత సహాయక చికిత్సలలో భాగంగా కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ చేయించుకున్నారు. 2019లో, సాధారణ పరీక్షలలో భాగంగా , ఆమెకు నాలుక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కణితిని తొలగించడానికి ఆమెకు శస్త్రచికిత్స జరిగింది, తరువాత తదుపరి చికిత్స కోసం కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ చేయబడ్డాయి. ఆమెకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించగా, 2024లో ఎడమ పెద్దప్రేగు (పెద్దప్రేగులో భాగం)లో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది. తదుపరి పరీక్షలలో ఎడమ పెద్దప్రేగు దిగువ భాగంలో కూడా పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించబడింది. పెద్దప్రేగు యొక్క ప్రభావిత భాగాన్ని తొలగించడానికి ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్సతో చికిత్స అందించబడింది, ఆ తర్వాత క్యాన్సర్ తిరిగి రాకుండా నిరోధించడానికి కీమోథెరపీని అందించారు. సమగ్రమైన మరియు బహుళ విభాగ చికిత్సా విధానానికి డాక్టర్ ఎన్. సుబ్బారావు, డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, డాక్టర్ మణికుమార్ ఎస్ మరియు డాక్టర్ ఇషాంత్ ఐ నాయకత్వం వహించారు, రోగికి సరైన సంరక్షణ అందించటంతో పాటుగా కోలుకునేలా చూసుకున్నారు.
ఒకే రోగిలో మూడు మెటాక్రోనస్ క్యాన్సర్ల ను దృష్టిలో ఉంచుకుని చేసిన జన్యు నిర్దారణ పరీక్షల ద్వారా రోగికి లించ్ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మూడు వేర్వేరు ప్రాణాంతకత క్యాన్సర్ల ను దృష్టిలో ఉంచుకుని, రోగి జన్యు ఉత్పరివర్తన పరీక్ష చేయించుకున్నారు, ఇది జన్యు ఉత్పరివర్తనను, లించ్ సిండ్రోమ్ ను నిర్ధారించింది.
"ప్రపంచ స్థాయి, నిరూపిత ఆధారిత క్యాన్సర్ సంరక్షణను అందించడంలో ఏఓఐ యొక్క నిబద్ధతకు ఈ కేసు ఉదాహరణగా నిలుస్తుంది. మూడు సింక్రోనస్ ప్రైమరీ మాలిగ్నన్సీలతో బాధపడుతున్న రోగికి విజయవంతంగా సమస్యను గుర్తించి చికిత్స చేయగల సామర్థ్యం మా ఆంకాలజీ బృందం యొక్క అధునాతన సామర్థ్యాలను మరియు ఆధునిక క్యాన్సర్ చికిత్సలో జన్యుపరమైన పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది" అని దక్షిణాసియా సిటీఎస్ఐ సీఈఓ హరీష్ త్రివేది ఏఓఐ బృందాన్ని ప్రశంసించారు.
ఏఓఐ లోని సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, ఈ తరహా కేసులలో జన్యు పరీక్ష యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, "లించ్ సిండ్రోమ్ బహుళ క్యాన్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ముందస్తు రోగ నిర్ధారణ మరియు అప్రమత్తతో కూడిన ఫాలో-అప్ వంటివి రోగి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కేసు అధిక-ప్రమాదం కలిగిన వ్యక్తులకు వ్యక్తిగతీకరించిన చికిత్స వ్యూహాలు మరియు జన్యు సలహా యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది" అని అన్నారు.
రోగి క్రమం తప్పకుండా ఫాలో-అప్‌లో కొనసాగుతుండటం తో పాటుగా , అద్భుతమైన రీతిలో కోలుకోవడంతో పాటుగా సానుకూల చికిత్స ఫలితాలను ప్రదర్శిస్తున్నారు. ఈ కేసు అధునాతన, రోగి-కేంద్రీకృత క్యాన్సర్ సంరక్షణను అందించడంలో ఏఓఐ యొక్క అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది, వ్యక్తులు అత్యాధునిక వైద్య నైపుణ్యపు మద్దతుతో సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను పొందుతున్నారని నిర్ధారిస్తుంది.