బాపట్ల జిల్లాలో విషాదం.. సముద్రంలో నలుగురు విద్యార్థులు గల్లంతు

Tragedy In Bapatla District Four Students Lost In The Sea. ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాద ఘటన జరిగింది. వేటపాలెం మండలం రామాపుం దగ్గర సముద్రంలో నలుగురు

By అంజి
Published on : 20 Oct 2022 5:08 PM IST

బాపట్ల జిల్లాలో విషాదం.. సముద్రంలో నలుగురు విద్యార్థులు గల్లంతు

ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాద ఘటన జరిగింది. వేటపాలెం మండలం రామాపుం దగ్గర సముద్రంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. గుంటూరులోని ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు విహరయాత్ర కోసం బాపట్ల జిల్లాకు వచ్చారు. ఈ క్రమంలోనే రామాపురం వద్ద ఓ ప్రైవేట్‌ రిసార్టులో దిగారు. రిసార్టు ఎదురుగా ఉన్న సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి గురై నలుగురు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైన విద్యార్థులు రమణ, గౌతమ్‌, రోహిత్‌, మహదేవ్‌ గుంటూరు జీవీఆర్ కాలేజీలో బీటెక్ సెకండియర్‌ చదువుతున్నట్లు గుర్తించారు. ఎమ్మెల్యే కరణం బలరాం ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ టి.శ్రీకాంత్‌ గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story