అయోధ్య రామ మందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ'కు సమయం దగ్గర పడుతోంది. మతపరమైన ఉత్సాహం భారతదేశం అంతటా రామభక్తులను పట్టుకుంది. శ్రీరాముడికి నైవేద్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు గురువారం శ్రీరాముడికి ప్రసాదంగా 25 గ్రాముల లక్ష లడ్డూలను రెడీ చేశారు. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్‌లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. 350 పెట్టెల్లో ప్యాక్ చేసిన 'లడ్డూ'లను 350 మంది భక్తులు సిద్ధం చేశారు. ఈ లడ్డూలను 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమం రోజున తిరుపతి నుంచి అయోధ్యకు తీసుకెళ్తారు. అయోధ్యలోని భక్తులకు ఉచితంగా ఈ లడ్డూలను పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలోనే లడ్డూలను టీటీడీ అయోధ్యకు చేర్చే పనిలో నిమగ్నం అయ్యింది. లడ్డూ ప్రసాదాలను అక్కడ ఆలయ నిర్మాణ ట్రస్ట్ర్‌కు అందజేయనుంది. శ్రీవారి లడ్డూ ప్యాకింగ్ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్ తోపాటు పోటు ఏఈవో శ్రీనివాసులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.