తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా డిసెంబర్ కోటా ఆన్‌లైన్ టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం ఇచ్చింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ టికెట్లు రిలీజ్ చేయనున్నారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు రిలీజ్ చేస్తారు.
24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వసతి కోటా, అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల చేస్తారు. 27వ తేదీ ఉదయం 11 గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు. పూర్తి వివరాలకు భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.