తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి గోదావరి నదిపై కొవ్వూరు-రాజమహేంద్రవరం రోడ్డు-కమ్-రైలు వంతెనపై మోటార్ బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు.
"ఇద్దరు బాధితులు ఒక బైక్‌పై, మరొక యువకుడు మరో బైక్‌పై ప్రయాణిస్తున్నారు. మృతి చెందిన ముగ్గురిలో ఇద్దరిది కొవ్వూరు అని, మరొకరిది రాజమహేంద్రవరం" అని కొవ్వూరు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంతో వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.