ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త‌

Tension situation at MLA balakrishna house in Hindupur.ప్ర‌ముఖ సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Dec 2021 4:23 PM IST
ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త‌

ప్ర‌ముఖ సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త‌ నెల‌కొంది. అనంత‌పురం జిల్లా హిందూపురంలోని ఆయ‌న నివాసాన్ని ముట్ట‌డించేందుకు వైసీపీ శ్రేణులు య‌త్నించ‌డంతో అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప‌ట్ట‌ణ స‌మీపంలోని డంపింగ్ యార్డు మార్పు అంశంపై టీడీపీ, వైసీపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రం తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం హిందూపురంకు చేసిందేమీ లేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని స‌వాల్ విసిరారు.

ఇందుకు టీడీపీ నేత‌లు సిద్ద‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో బాల‌కృష్ణ ఇంటికి టీడీపీ నేత‌లు చేరుకున్నారు. మ‌రోవైపు వైసీపీ నేత‌లు బాల‌కృష్ణ ఇంటిని ముట్ట‌డికి బ‌య‌లుదేరారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని వైసీపీ నాయ‌కుల‌ను దారి మ‌ధ్య‌లోనే నిలువ‌రించారు. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాలు నినాదాల‌తో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. టీడీపీ కార్య‌క‌ర్త‌లు 'జై బాల‌య్య' అన‌గా వైసీపీ శ్రేణులు 'జై జ‌గ‌న్' అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Next Story