టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌

Telugudesam Party leader Dhulipalla Narendra arrest.తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2022 12:22 PM IST
టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌

తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద ధూళిపాళ్ల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు అక్క‌డి నుంచి త‌ర‌లించారు.

పొన్నూరు నియోజకవర్గంలో మట్టి దోపిడి జరుగుతుందని ఆరోపిస్తూ నేడు 'చలో అనుమర్లపూడి'కి టీడీపీ పిలుపునిచ్చింది. అయితే చలో అనుమర్లపూడి కి అనుమతి లేదంటూ పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉందని స్పష్టం చేశారు. టీడీపీ నేత‌లు అనుమ‌ర్ల‌పూడికి రాకుండా చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేశారు. కొంద‌రు నేత‌ల‌ను గృహనిర్భంధం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ధూళిపాళ్ల న‌రేంద్ర మాత్రం పోలీసుల క‌ళ్లు గ‌ప్పిఅనుమ‌ర్ల‌పూడికి చేరుకున్నారు.

పోలీసుల వైఖ‌రిపై న‌రేంద్ర తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌లెక్ట‌ర్ స‌హా ఎవ‌రి అనుమ‌తుల‌తో చెరువును త‌వ్వుతున్నార‌ని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో టీడీపీ శ్రేణులు, పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో ధూళిపాళ్ల న‌రేంద్ర‌తో పాటు మరికొంత మంది టీడీపీ నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అక్క‌డి నుంచి తీసుకువెళ్లారు.

Next Story