రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసాపై నిర్ణయం: భట్టి
తెలంగాణలో రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 11 July 2024 3:00 PM ISTరైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసాపై నిర్ణయం: భట్టి
తెలంగాణలో రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి రూ.15వేలు అందిస్తామని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చింది. ఈ మేరకు రైతులు తర్వాత విడత కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం రైతుభరోసా నిధుల విధివిధానాలపై కసరత్తులు చేస్తోంది. సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా డబ్బులు అందిస్తామని చెబుతోంది. తాజాగా రైతుభరోసా నిధుల జమపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు.
గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో రైతు భరోసా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కేబినెట్ సబ్‌కమిటీ ఆధ్వర్యంలో రైతుభరోసా పథకం విధివిధానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు.ఈ క్రమంలోనే మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అన్నదాతల అభిప్రాయం మేరకు రైతుభరోసా నిధుల జమ జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి యోచిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సన్నకారు రైతుల కోసం పథకాల రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. ప్రజలతో చర్చించి పథకాలు అమలు చేయడమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.