తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయింది. గుర్తు తెలియని హ్యాకర్ల చేతిలోకి యూట్యూబ్ ఛానల్ వెళ్ళింది. ఛానెల్ అందుబాటులో లేకుండా పోయింది. ఛానెల్‌లో వీడియోలను చూడటానికి ప్రయత్నించిన టీడీపీ మద్దతుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రతా ఉల్లంఘనను కూడా చూసారు.
దీంతో స్పందించిన టీడీపీ టెక్నికల్ టీమ్ సత్వరమే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఈ సైబర్ అటాక్‌కు కారణమైన హ్యాకర్లను గుర్తించేందుకు వారు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తమ ఛానల్ హ్యాకింగ్ గురించి YouTube సంస్థకు తెలియజేసింది. ఛానెల్‌ని తిరిగి నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది.