అల్లు అర్జున్‌పై ట్వీట్‌.. డిలీట్‌ చేసిన టీడీపీ ఎంపీ

నంద్యాలలో అల్లు అర్జున్‌ ఎన్నికల ప్రచారానికి, పుష్ప-2కు లింక్‌ చేస్తూ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి  Published on  2 Dec 2024 8:40 AM IST
TDP MP Byreddy Sabari, tweet, Allu Arjun, Pushpa-2

అల్లు అర్జున్‌పై ట్వీట్‌.. డిలీట్‌ చేసిన టీడీపీ ఎంపీ

నంద్యాలలో అల్లు అర్జున్‌ ఎన్నికల ప్రచారానికి, పుష్ప-2కు లింక్‌ చేస్తూ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ ట్వీట్‌పై ఐకాన్‌ స్టార్‌ అభిమానులు విమర్శిస్తూ కామెంట్లు చేయడంతో ఆమె కాసేపటికే ఆ పోస్టును డిలీట్‌ చేశారు. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి పోటీ చేసిన తన ఫ్రెండ్‌ శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డికి మద్ధతుగా అల్లు అర్జున్‌ నంద్యాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

పుష్ఫ-2 సినిమా విడుదల సందర్భంంగా ఆ మూవీ హీరో అల్లు అర్జున్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేశారు. ''మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఇంకా మరచిపోలేదు. అదే తరహాలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా ఒకటి నంద్యాలలో ప్లాన్‌ చేయండి. మీరు నంద్యాలకు రావడమనే సెంటిమెంట్‌ మాకు బాగా పని చేసింది. మీ పుష్ప-2 సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం'' అని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్‌ వెళ్లారు. వైసీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా నంద్యాలలోకి ఆయన్ను తీసుకువచ్చారు. ఎన్నికల సమయంలో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉండగా.. అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారని అల్లు అర్జున్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్‌పై శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై అప్పట్లో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఈ కేసుపై కోర్టు తీర్పు వెలువరించింది. వీరిపై నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసుల్ని హైకోర్టు కొట్టివేస్తూ తీర్పును ఇచ్చింది.

Next Story