ఇంటింటికి పేపర్లు వేసిన టీడీపీ ఎమ్మెల్యే

TDP MLA Nimmala Ramanaidu Distributes News Paper To Local People. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్ అవతారమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆదివారం

By అంజి  Published on  1 Aug 2022 9:56 AM IST
ఇంటింటికి పేపర్లు వేసిన టీడీపీ ఎమ్మెల్యే

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్ అవతారమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆదివారం ఉదయం ఇంటింటికీ దినపత్రికలు పంపిణీ చేశారు. తెల్లవారుజామునే పట్టణంలోని మావుళ్లమ్మపేటకు చేరుకున్న ఆయన లోకల్ పేపర్‌ బాయ్స్‌తో కలిసి వాటిని ప్రజలకు అందించేందుకు రెడీ అయ్యారు. సైకిల్‌పై న్యూస్‌ పేపర్లను పెట్టుకుని 31వ వార్డులోని నాగరాజుపేట, తదితర ప్రాంతాల్లోని చందాదారులకు అందించారు. టిడ్కో ఇళ్ల పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

టిడ్కో ఇళ్లలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసి వాటిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని లబ్దిదారులకు వివరించారు. పేపర్లు తీసుకోవడానికి వచ్చిన వారికి ప్రభుత్వ తీరును, పట్టణవాసులకు 10 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు కేటాయించిన విధానాన్ని వివరించారు. ఇకపై ప్రతి నెలా నాలుగు రోజుల పాటు పేపర్లు వేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చందాదారులకు తెలియజేస్తానన్నారు. మరో నాలుగు రోజులు శానిటేషన్ పనులు చేపట్టి నిరసనకు దిగుతానని ఎమ్మెల్యే నిమ్మల వెల్లడించారు.

Next Story