టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి తప్పిన ప్రమాదం.. డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు (వీడియో)
పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కారు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 6:28 AM GMTటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి తప్పిన ప్రమాదం.. డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు (వీడియో)
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కారు ప్రమాదానికి గురైంది. శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. చినరాజప్ప ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో చినరాజప్పకు ఎలాంటి గాయాలు కాలేదు. సురక్షితంగా బయటపడ్డారు. దాంతో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా ఊపిరిపీల్చుకున్నారు.
శనివారం ఉదయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జాబితాలో పెద్దాపురం టీడీపీ అభ్యర్థిగా చినరాజప్ప ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రమే టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి చినరాజప్ప ర్యాలీ నిర్వహించారు. మద్దతు తెలుపుతు పెద్ద ఎత్తున అభిమానులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. కొది అడుగుల దూరం వరకు డివైడర్‌పైనే వెళ్లింది కారు. అయితే.. కారు డ్రైవర్ సెడన్‌గా బ్రేకులు వేయడంతో డివైడర్‌పైనే కారు ఆగిపోయింది. ముందుగా ఈ ప్రమాదం జరగడంతో పార్టీ కార్యకర్తలు, స్థానికులు ఆందోళన చెందారు. చినరాజప్ప క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ప్రమాదం తర్వాత చినరాజప్పను మరో కారులో అక్కడి నుంచి తీసుకెళ్లారు. కారుక ఒక వ్యక్తి అనుకోకుండా అడ్డురావడంతో అతడిని తప్పించే క్రమంలోనే కారు డ్రైవర్ డివైడర్‌ను ఎక్కించినట్లు తెలుస్తోంది. శనివారం టీడీపీ, జనసేన అధ్యక్షులు ఇద్దరూ ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 5 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చినరాజప్పకు శనివారం రాత్రి తప్పిన ప్రమాదం
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 25, 2024
అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ చినరాజప్ప
తొలిజాబితాలో ఎంపికైన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఘటన pic.twitter.com/WDJethoGy0