చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. 'మహానాడు' వాయిదా ఎందుకంటే..

టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు

By Srikanth Gundamalla  Published on  17 May 2024 5:40 AM GMT
TDP, mahanadu,  Chandrababu,

చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. 'మహానాడు' వాయిదా ఎందుకంటే..

టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తెలుగు తమ్ముళ్ల పండుగ అయిన మహానాడు కార్యక్రమాన్ని చంద్రబాబు వాయిదా వేశారు. ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు చంద్రబాబు. ఈ మేరకు మహానాడు కార్యక్రమం వాయిదా విషయాన్ని పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా.. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28వ తేదీన ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. జూన్ 4వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు వెల్లడి అవుతాయి. పార్టీ నేతలంతా ఆ పనుల్లో ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మహానాడు కార్యక్రమం నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వెల్లడి కావడంతో.. రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టీడీపీ ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది. 2014 ఎన్నికల సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మే 16న కౌంటింగ్ నిర్వహించగా.. అప్పుడు ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాట్లకు సంబంధించి బిజీగా ఉండటంతో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించలేదు. 2019 ఎన్నికల విషయానికి వస్తే అప్పుడు టీడీపీ ఓడిపోయింది. దాంతో.. 2019లో కూడా మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించలేదు.

అంతేకాదు.. 2020, 2021 ఏడాదిల్లో కూడా మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశారు. అప్పుడు కరోనా వేవ్‌ ఉన్న కారణంగా రద్దు చేశారు. 2021 మాత్రం జూమ్‌ కాల్‌ ద్వారా అయినా సరే మహానాడు నిర్వహించారు. ఆ తర్వాత ఏడాది 2022లో ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వమించారు. 2023లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహానాడుని నిర్వహించగా.. ఈసారి మాత్రం ఎన్నికల ఫలితాల కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక రాబోయే ఏడాది 2025లో మాత్రం కచ్చితంగా మహానాడును నిర్వహించేలా కనిపిస్తోంది.

Next Story