వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పితో విలవిలలాడారు.

By అంజి  Published on  26 Sept 2024 10:29 AM IST
TDP leader, Vangaveeti Radhakrishna, mild heart attack

వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన ఛాతీలో నొప్పితో విలవిలలాడారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే విజయవాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్లు స్పందిస్తూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

రాధాకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు నిర్దారించారు. అయితే రెండు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. అటు రాధాకృష్ణకు గుండెపోటు వచ్చిందన్న వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు ఆయన ఇంటి వద్దకు వెళ్లి వివరాలను తెలుసుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా రాధా ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. రాధా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Next Story