లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
TDP leader Lokesh take into the police custody.గన్నవరం ఎయిర్ పోర్టులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి
By తోట వంశీ కుమార్ Published on 9 Sept 2021 1:45 PM ISTగన్నవరం ఎయిర్ పోర్టులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నరసరావుపేట పర్యట కోసం గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చారు. కరోనా నిబంధనలు దృష్ట్యా పర్యటకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా..పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదని, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నానని, ఆ కుటుంబాన్ని పరామర్శించి వస్తానని చెప్పినా పోలీసులు వినకపోవడంతో మండిపడ్డారు. కావాలనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
లోకేష్‌ను అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను దేవినేని ఉమా మహేశ్వరరావు పోస్ట్ చేశారు. నారా లోకేశ్ అరెస్ట్ అప్రజాస్వామికం. ఆడబిడ్డలకు న్యాయం చేయాలని అడిగితే అరెస్టు చేస్తారా? లోకేశ్ పర్యటనకు ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు వైఎస్ జగన్ అని ఆయన మండిపడ్డారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh అరెస్ట్ అప్రజాస్వామికం. ఆడబిడ్డలకు న్యాయం చేయమని అడిగితే అరెస్టు చేస్తారా? లోకేష్ పర్యటనకు ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు @ysjagan pic.twitter.com/rie42uhgqk
— Devineni Uma (@DevineniUma) September 9, 2021