మహిళలను గౌరవించడాన్ని పాఠ్యాంశంగా తెస్తాం: లోకేశ్
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలను గౌరవించడాన్ని పాఠ్యాంశంగా తెస్తామని లోకేష్ అన్నారు.
By అంజి Published on 8 March 2023 8:05 AM GMTమహిళా దొనోత్సవం రోజున.. మహిళలకు లోకేష్ పాదాభివందనం
సీఎం జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగితే 21 రోజుల్లొ ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో 38వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా చింతపర్తి విడిది కేంద్రం దగ్గర ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా మహిళలతో లోకేష్ ముఖాముఖి మాట్లాడరు. ఈ సందర్భంగా సమావేశంలో మహిళలకు లోకేష్ పాదాభివందనం చేశారు.
చట్టాల ద్వారా మహిళలకు రక్షణ ఉండదన్నారు. పిల్లలకు చిన్న వయస్సు నుంచే మహిళల గౌరవం తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు చేర్చాల్సిన అవసరం ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలను గౌరవించడాన్ని పాఠ్యాంశంగా తెస్తామని లోకేష్ అన్నారు. సీఎం జగన్ మహిళలను మోసం చేశారని అన్నారు. కేంద్రం లెక్కల ప్రకారం.. సీఎం జగన్ పాలనలో 52 వేల మంది మహిళలపై వేధింపులు, 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని లోకేష్ తెలిపారు.
ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడని తన తల్లిని అసెంబ్లీ వేదికగా వైసీపీ నాయకులు అవమానించారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారింలోకి వచ్చాక.. కేజీ నుంచి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారి కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతామన్నారు. మహిళా మంత్రులే మహిళల్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన వైఎస్ జగన్.. మద్యం నిషేధం చేయకుండా ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు.