టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

TDP leader Katragadda Babu dies due to cardiac arrest.తెలుగుదేశం పార్టీలో విషాదం నెల‌కొంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Oct 2021 8:27 AM IST
టీడీపీ సీనియర్ నేత కన్నుమూత

తెలుగుదేశం పార్టీలో విషాదం నెల‌కొంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత కాట్ర‌గ‌డ్డ బాబు క‌న్నుమూశారు. శ‌నివారం మ‌ధ్యాహ్నాం ఆయ‌నకు గుండెపోటు రాగా.. కుటుంబ‌స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ సాయంత్రం ఆయ‌న తుదిశ్వాస విడిచారు. అజిత్‌సింగ్‌న‌గ‌ర్‌లోని త‌న ప్రింటింగ్ ప్రెస్ కార్యాల‌యంలో ఉండ‌గా కాట్రగడ్డ బాబు గుండెపోటుకు గురైయ్యార‌ని కుటుంబస‌భ్యులు తెలిపారు.

గత పాతికేళ్ల‌లో టీడీపీ పార్టీలో ఆయ‌న వివిధ స్థాయిల్లో ప‌నిచేశారు. అనేక ప‌ద‌వులు చేప‌ట్టారు. సామాజిక సేవలో ముందు ఉండేవారు. ద‌శాబ్ద‌కాలంగా పేద‌ల‌కు ఉచితంగా మందుల పంపిణీ చేస్తూ దాతృత్వ గుణాన్ని చాటుకుంటున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆయ‌న చేప‌ట్టారు. నిత్యం కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండేవారు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల టీడీపీ నాయ‌కులు తీవ్ర సంతాపం తెలిపారు.

ప్రింటింగ్ రంగంలో తనదైన ముద్ర‌ను వేశారు కాట్ర‌గ‌డ్డ బాబు. నగరంలో వేడుకలకు బ్యానర్లు రాసే విధానానికి స్వస్తి పలికి తొలిసారి ఫ్లెక్సీలను పరిచయం చేశారు. ఆ తర్వాత తన ప్రింటింగ్‌ ప్రెస్‌ ద్వారా ముద్రించే ఫ్లెక్సీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

Next Story