విజ‌య‌సాయి రెడ్డిపై విరుచుకుప‌డ్డ బుద్ధా వెంక‌న్న‌

వైసీపీ నేత, రాజ్య‌స‌భ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

By Kalasani Durgapraveen  Published on  6 Dec 2024 9:31 AM GMT
విజ‌య‌సాయి రెడ్డిపై విరుచుకుప‌డ్డ బుద్ధా వెంక‌న్న‌

వైసీపీ నేత, రాజ్య‌స‌భ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డికి పరువు లేదు.. పరువు లేని వ్యక్తి విజయ సాయి రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి కి మానవ విలువలు తెలియదన్నారు.

విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి కుల పిచ్చి ఉందేమో ..చంద్రబాబు నాయుడుకి కుల పిచ్చి లేదన్నారు. ఏ కులం లేని బాబుకు కుల పిచ్చి అంటగడతారా.. విజయసాయి రెడ్డి పై క్రిమినల్ కేసు వేస్తాను అన్నారు.

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంతో మంది టిడిపి నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఐదేళ్లపాటు చనిపోకుండా బతికి ఉంటే జైలుకు పంపుతామని అంటారా.. కాకినాడ సిపోర్టును కె.వి.రావు అభివృద్ధి చేశారన్నారు.

విజయసాయిరెడ్డి ఒక బ్రోకర్.. కాబట్టే రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. వైసీపీ నేతలకు భయపడి ఆనాడు బయటికి వచ్చేందుకు ఎవరు ధైర్యం చేయలేదు. ఇప్పుడు వాళ్లంతా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను బాబుకు విన్నవిస్తున్నారన్నారు. అధికారం అడ్డుపెట్టుకొని ఎంతోమంది ఆస్తులను లాక్కున్నారన్నారు.

Next Story