జగన్.. పులివెందులలో రాజీనామా చెయ్.. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దాం
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.
By Medi Samrat
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలని.. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. అలా ఎన్నికలకు వెళ్తే.. మొన్న వచ్చిన మెజారిటీ కూడా జగన్‌కు వస్తుందా.. అసలు జగన్ గెలుస్తారో లేదో చూద్దామన్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయమా.. అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ చిలక జోస్యం ఆపాలని హితువు పలికారు.
జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా..? అదే మాకు 164 సీట్లు వస్తె evm లు గురించి మాట్లాడుతున్నావు...
— Budda Venkanna (@BuddaVenkanna) June 18, 2024
ఒకపని చేద్దాం.. నువ్వు పులివెందులలో రాజీనామా చెయ్యి.. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక పెట్టమని అందరం కలిసి ఎలెక్షన్ కమిషన్ ను కొరదాం.. నీకు ఈసారి మొన్న వచ్చిన… https://t.co/yWzh1jDCS8
అంతకుముందు జగన్ ఎక్స్ వేదికగా ఈవీఎంల గురించి సంచలనాత్మక పోస్టు పెట్టారు. ఇందుకు స్పందిస్తూ.. బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్‌లో.. న్యాయం జరగడం మాత్రమే కాదు.. అందించినట్లు స్పష్టంగా కనిపించాలి అన్నారు. అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటం మాత్రమే కాదు.. నిస్సందేహంగా అది ప్రబలంగా ఉన్నట్లు కనిపంచాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ది చెందిన ప్రజాస్వామ్యంలో ఎన్నికల పద్దతుల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడంలో మనం కూడా అదే దిశగా పయనించాలంటూ రాసుకొచ్చారు. ఇందుకుస్పందనగా బుద్ధా వెంకన్న సవాల్ ట్వీట్ విసిరారు.