పవన్‌ను లక్ష మెజార్టీతో గెలిపిస్తాం..వైసీపీకి టీడీపీ కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  21 March 2024 2:51 PM IST
tdp, counter tweet, ycp, pawan kalyan, andhra pradesh election,

 పవన్‌ను లక్ష మెజార్టీతో గెలిపిస్తాం..వైసీపీకి టీడీపీ కౌంటర్ 

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నాయకులు పార్టీలపై అసంతృప్తితో ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఇక మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ పార్టీలో కూడా అసమ్మతి వినిపించింది. అయితే.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ పోటీ చేయడంపై వైసీపీ విమర్శలు చేస్తూ ఓ ట్వీట్ చేసింది.

జాగ్రత్త పవన్ కళ్యాణ్‌.. ఏదన్నా అటు ఇటూ అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించే వాళ్లలో మొదటి వరుసలో ఉండేది టీడీపే అని వైసీపీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. చూస్కో మరి అంటూ పవన్‌ను వైసీపీ హెచ్చరించింది. అయితే తాజాగా ఈ పోస్టుపై టీడీపీ స్పందించింది. గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 'మీ భార్య భారతి రెడ్డి రాసే అబద్దాలను మీ చెల్లి షర్మిల కూడా ఛీ కొట్టిందని టీడీపీ విమర్శలు చేసింది. అలాంటిది ఏపీ ప్రజలు మీ రాతలు ఎలా నమ్ముతారంటూ ప్రశ్నించింది. పవన్‌ను జనసైనికులతో కలిసి లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్‌ను గెలిపించుకునే బాధ్యత టీడీపీనే తీసుకుంటుంది. కొంపలో కుంపటితో నీ పులివెందులలో బొక్క పడింది... ముందు దాన్ని పూడ్చుకో. సీఎం సీటుతో పాటు ఎమ్మెల్యేగా ఓడిపోయే ప్రమాదం ఉంది.' అని ఎక్స్‌లో టీడీపీ పోస్టు పెట్టింది.

కాగా.. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ పోటీ చేస్తానని చెప్పిన వెంటనే టీడీపీలో అసమ్మతి గళం వినిపించిన విషయం తెలిసిందే. టీడీపీ నేత వర్మ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్‌ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం అసెంబ్లీ బరిలో పోటీ చేస్తానని అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేయాలని పిఠాపురం అసెంబ్లీ బరిలో నుండి తప్పుకున్నానని, ఇప్పుడు పవన్ ఎంపీగా పోటీ చేస్తే గనక పిఠాపురం అసెంబ్లీ బరిలో నిలుస్తానని వర్మ అన్నారు.

Next Story