వెయ్యి ఎకరాల భూమి భూములు చేతులు మారాయి: బోండా ఉమ
పేదలు, రైతుల భూములను అక్రమ జీవో ద్వారా దోచుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 27 May 2024 7:34 AM GMTవెయ్యి ఎకరాల భూమి భూములు చేతులు మారాయి: బోండా ఉమ
పేదలు, రైతుల భూములను అక్రమ జీవో ద్వారా దోచుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్ఎల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇలా వెయ్యి ఎకరాలకు పైగా భూఉలు చేతులు మారుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. తక్కువ ధరకు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకన్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో పెద్దఎత్తున భూదోపిడీ జరిగినా చర్యలు లేవని ఆయన విమర్శించారు. సీఎస్ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలు ఉన్నా చర్యలు ఉండవా అని బోండా ఉమ ప్రశ్నించారు.
విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన బోండా ఉమామహేశ్వరరావు సీఎస్ జవహర్‌రెడ్డిపై మండిపడ్డారు. సీఎం జగన్, ఆయన బంధువుల అండతో సీఎస్ జవమర్‌రెడ్డి భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు భోగాపురం మండలంలో సీఎస్ రూ.2వేల కోట్ల స్కామ్ చేశారని అన్నారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరుపై విచారణ జరిపించాలని డిఆండ్ చేశారు. ఇక ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. ఆయనపై చర్యలు తీసుకోరా అని బోండా ఉమ నిలదీశారు.
ఈ విషయంలో చాలాసార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని బోండా ఉమ చెప్పారు. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని చెప్పారు.. సీఈవో స్పందించకపోవడం వల్ల జవహర్‌రెడ్డి అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బోండా ఉమ చెప్పారు. సీఎస్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని బోండా డిమాండ్ చేశారు. అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. డీ పట్టాలన్నీ సీజ్ చేసి అధికారులందరిపైనా విచారణ జరపాలన్నారు. జవహర్‌రెడ్డికి ఏ తప్పు చేయకపోతే తమ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.