టీడీపీ, జనసేన సభకు బస్సులు ఇస్తామని ముందుకొచ్చిన ఆర్టీసీ
టీడీపీ, జనసేన పార్టీలు ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 12 March 2024 10:24 AM ISTటీడీపీ, జనసేన సభకు బస్సులు ఇస్తామని ముందుకొచ్చిన ఆర్టీసీ
టీడీపీ, జనసేన పార్టీలు ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సభ కోసం పార్టీ శ్రేణులను తరలించేందుకు బస్సులు కావాలంటూ ఆర్టీసీకి లేఖ రాశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆయన లేఖకు ఏపీఎస్ ఆర్టీసీ సమాధానం ఇచ్చింది. ఎన్ని బస్సులు కావాలో తెలపాలంటూ కబరు పంపింది.
ఏపీలో ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేనతో పాటుగా బీజేపీ కలిసిన విషయం తెలిసిందే. మూడు పార్టీలు కలిసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాయి. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సీట్ల పంపకాలపై క్లారిటీ రానుంది. అయితే.. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన సభ నిర్వహిస్తున్నాయి. పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ సభలో బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. ఈ సభకే బస్సులు కావాలంటూ ఏపీఎస్ ఆర్టీసీకి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. దాంతో.. ఆయన లేఖతో స్పందించిన ఆర్టీసీ.. ఎన్ని బస్సులు కావాలో తెలపాలంటూ కబురు పంపింది.
కాగా.. గతంలో టీడీపీ, జనసేన నిర్వహించిన సభలకు బస్సులు కావాలంటూ ఆర్టీసీని కోరారు. అయితే.. అప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దాంతో.. ఆర్టీసీ యాజమాన్యంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కావాలనే తమ సభలకు బస్సులను ఇవ్వడం లేదంటూ ఆరోపించాయి. అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ, జనసేన నాయకులు. అధికారులపై వైసీపీ నాయకులు ఒత్తిడి చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే చిలకలూరిపేటలో సభకు మరోసారి బస్సులు కావాలంటూ టీడీపీ విజ్ఞప్తి చేయగా ఆర్టీసీ అధికారులు స్పందించి రిప్లై ఇచ్చారు. ప్రధాని మోదీ వస్తున్నారనే ఈసారి ఆర్టీసీ స్పందించిందనీ.. లేదంటే సైలెంట్‌గానే ఉండేదని పలువురు అంటున్నారు. ఇక టీడీపీ ఆర్టీసీకి ఎన్ని బస్సులు కావాలనే దానిపై లేఖ రాయాల్సి ఉంది. సభకు వచ్చిన వారిని సేఫ్‌గా వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు బస్సులు అవసరం అనీ అచ్చెన్నాయుడు ఆర్టీసీకి రాసిన లేఖలో తెలిపారు.