ఏపీ సీఎం జగన్ బాటలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
Tamil Nadu to set up 600 village secretariats says CM MK Stalin.ఏపీలో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ
By తోట వంశీ కుమార్ Published on 23 April 2022 7:36 AM GMTఏపీలో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. అసెంబ్లీ వేదికగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటుపై శుక్రవారం ఓ ప్రకటన చేశారు. అన్ని సౌకర్యాలతో గ్రామ సచివాలయాను నిర్మిస్తామన్నారు. సమావేశ మందిరంతో సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
స్థానిక ప్రజాప్రతినిధుల సిట్టింగ్ ఫీజును ఐదు నుంచి పది రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 న స్థానిక పాలనా దినోత్సవంగా పాటిస్తామని అన్నారు. అలాగే.. ఏడాదికి గ్రామసభ సమావేశాలను నాలుగు నుంచి ఆరు కు పెంచుతామన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇక సుపరిపాలన అందించే పట్టణ పంచాయతీలకు 'ఉత్తమర్ గాంధీ' అవార్డును ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం 2019 అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడానికి ప్రయత్నిస్తోంది. 700 వందలకుపైగా సేవలను అందిస్తోంది. ప్రభుత్వ పథకాలతో పాటుగా అన్ని రకాల సేవలు వాలంటీర్ల ద్వారా అమలు చేస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ బియ్యం వంటి కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు అమలు చేస్తుండగా.. తాజాగా తమిళనాడు గ్రామ సచివాలయ వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించనున్నట్లు తెలిపింది.