డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్‌ తీపికబురు.. త్వరలోనే 'స్వయం' పథకం అమలు

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వయం’ అనే వినూత్న పథకాన్ని తీసుకువస్తోంది.

By -  అంజి
Published on : 10 March 2026 8:13 AM IST

Swayam Scheme AP, Kondapalli Srinivas, DWACRA Women Entrepreneurs, MSME Andhra Pradesh, Women Empowerment, Global Branding for SHG Products

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్‌ తీపికబురు.. త్వరలోనే 'స్వయం' పథకం అమలు

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వయం’ అనే వినూత్న పథకాన్ని తీసుకువస్తోంది. సోమవారం విజయనగరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాష్ట్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఈ పథకం ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్ కల్పిస్తామని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే వస్తువులకు కేవలం స్థానిక మార్కెట్లే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించడానికి అవసరమైన అనుమతులు, నాణ్యత ప్రమాణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పటికే రాష్ట్రంలో వేలాది మంది మహిళలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గడిచిన ఏడాది కాలంలోనే దాదాపు లక్ష మంది మహిళలు సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగడం విశేషం. 'స్వయం' పథకం కార్యరూపం దాల్చితే, మహిళా సంఘాల ఆదాయం మరింత పెరిగి వారు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Next Story