అనకాపల్లి జిల్లాలో విషాదం.. సముద్రతీరంలో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

Students missing pudimadaka beach Anakapalle district. పూడిమడక సముద్ర తీరంలో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిని జిల్లాలోని ఓ ఇంజనీరింగ్​

By అంజి
Published on : 29 July 2022 6:40 PM IST

అనకాపల్లి జిల్లాలో విషాదం..  సముద్రతీరంలో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

సరదాగా స్నేహితులంతా.. కాసేపు సముద్ర తీరంలో సేదతీరుదామని వెళ్లారు. బీచ్‌కు వెళ్లిన తర్వాత కేరింతలు కొడుతూ కోలహలం చేశారు. ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇంతలోనే ఊహించని సంఘటన జరిగింది. అప్పటి వరకు తమతో ఎంతో సంతోషంగా గడిపిన స్నేహితులను సముద్రం తన ఒడిలోకి తీసుకుంది. కళ్లముందే ఇదంతా జరిగినా ఏమీ చేయలేని పరిస్థితి. తమ స్నేహితులు అలలు తాకిడికి కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేక మిగిలిన స్నేహితులు గుండెలు పగిలేలా రోదించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పూడిమడక సముద్ర తీరంలో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిని జిల్లాలోని ఓ ఇంజనీరింగ్​ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం 15 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లగా.. ఏడుగురు గల్లంతయ్యారని.. మిగతా 8 మంది క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. గల్లంతైన వారిలో పవన్​ అనే విద్యార్థి మృతదేహాం లభ్యమైంది. మిగతా విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

Next Story