గల్లంతైన చిన్నారుల ఘటన విషాదాంతం
Student dead bodies found in muneru.గల్లంతైన చిన్నారుల ఘటన విషాదాంతమైంది. కృష్ణా జిల్లా చందర్లపాడు
By తోట వంశీ కుమార్
గల్లంతైన చిన్నారుల ఘటన విషాదాంతమైంది. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మునేరులో ఈతకు వెళ్లి గల్లంతైన ఐదుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. కర్లబాలయేసు(12), జెట్టి అజయ్(12), మాగులూరి సన్నీ(12), గురజాల చరణ్(14), రాకేశ్ (11) మృతదేహాలను మంగళవారం ఉదయం మున్నేరు వెలికితీశారు. చిన్నారులను విగతజీవులుగా చూసిన వారి తల్లిదండ్రులు.. గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఇది జరిగింది..?
ఏటూరు గ్రామానికి చెందిన కర్ల బాలయేసు, మాగులూరి సన్నీ, అజయ్, చరణ్, మైల రాకేష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సన్నీ, బాలయేసు, అజయ్ లు ఏడో తరగతి చదువుతుండగా.. రాకేష్ ఆరో తరగతి, చరణ్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. సోమవారం వీరంతా కలిసి మునేరులో స్నానం చేసేందుకు ఇంటి నుంచి సైకిళ్లపై మునేరుకి వెళ్లారు. పొలం పనులకు వెళ్లిన వీరి తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చే సరికి వీరు కనిపించలేదు. ఆందోళన చెందిన వారు పిల్లలకోసం వెతకడం ప్రారంభించారు. చిన్నారులంతా మునేరువైపు వెళ్లారని పశువుల కాపరి చెప్పడంతో అక్కడకు వెళ్లి చూసేసరికి దుస్తులు, సైకిళ్లు కనిపించాయి. అయితే.. చిన్నారుల ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు, రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం సాయంత్రం గత ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా.. ఈ రోజు ఉదయం ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు. రాకేశ్ ఆచూకీ తెలియాల్సి ఉంది.