అమరావతి: శనగ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. రబీ సీజన్‌కు సంబంధించిన శనగ విత్తనాలు సబ్సిడీపై రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా కూడా రైతులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుందన్న ఆయన.. ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రైతు ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యం అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.