శ్రీశైలానికి భారీ వ‌ర‌ద‌.. 10గేట్ల ఎత్తివేత‌.. క్యూ క‌డుతున్న ప‌ర్యాట‌కులు

Srisailam Reservoir 10 Gates lifted.శ్రీశైలం జ‌లాశ‌యానికి భారీ వ‌ర‌ద కొన‌సాగుతోంది. దీంతో తాజాగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2021 10:03 AM IST
శ్రీశైలానికి భారీ వ‌ర‌ద‌.. 10గేట్ల ఎత్తివేత‌.. క్యూ క‌డుతున్న ప‌ర్యాట‌కులు

శ్రీశైలం జ‌లాశ‌యానికి భారీ వ‌ర‌ద కొన‌సాగుతోంది. దీంతో తాజాగా రిజర్వాయర్ 10 గేట్లను ఎత్తారు. ప‌ది గేట్ల‌ను ప‌ది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. 2,76.160 క్యూసెక్యుల వ‌ర‌ద ప్ర‌వాహం సాగ‌ర్ దిశ‌గా సాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాల కారణంగా పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. కృష్ణా నది నుంచి మూడు లక్షలు, తుంగభద్ర నది నుంచి లక్ష క్యూసెక్కుల నీరు శ్రీశైలం రిజర్వాయర్‌లో కలుస్తుంది.

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటిమట్టం 884.40 అడుగులున్నది. పూర్తిస్థాయి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 212.38 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్ప‌త్తిని ప్రారంభించి మ‌రో 50వేల క్యూసెక్యుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. గ‌త‌వారం నుంచి వ‌ర‌ద కొన‌సాగుతుండ‌డంతో నిన్న సాయంత్రం కొన్ని గేట్లు ఎత్తిన విష‌యం తెలిసిందే. శ్రీశైలం డ్యామ్‌ గేట్లు తెర‌వ‌డంతో ఆ సుంద‌ర దృశ్యాల‌ను చూసేందుకు ప‌ర్యాట‌కులు శ్రీశైలానికి క్యూ క‌డుతున్నారు.

మరో వైపు ఎగువన ఉన్న జూరాల జలాశయానికి సైతం వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం 4.15లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 43 గేట్లు ఎత్తివేసి.. 4,06,604 టీఎంసీలు దిగువకు విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 6.676 టీఎంసీలు నిల్వ ఉన్నది.

Next Story