Srikakulam: చిన్న షాపుకు భారీగా కరెంటు బిల్లు.. రూ. కోటికి పైగా రావడంతో..

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో కోటి రూపాయలకు పైగా కరెంటు బిల్లు రావడంతో షాపు యజమాని షాకయ్యాడు.

By అంజి  Published on  3 Oct 2023 1:11 PM IST
Srikakulam,  electricity bill , Kotturu town

Srikakulam: చిన్న షాపుకు భారీగా కరెంటు బిల్లు.. రూ. కోటికి పైగా రావడంతో..

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో కోటి రూపాయలకు పైగా కరెంటు బిల్లు రావడంతో షాపు యజమాని షాకయ్యాడు. కొత్తూరు పట్టణంలోని చిన్న నగల దుకాణం యజమాని జి. అశోక్‌కు సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబర్‌ 2 వరకు వినియోగించిన విద్యుత్‌కు రూ.1,01,56,116 బిల్లు వచ్చింది. పాలకొండ రోడ్డులోని దుర్గా జువెలర్స్ యజమాని విద్యుత్ సిబ్బంది ఇచ్చిన బిల్లు చూసి షాక్ తిన్నారు. సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబర్‌ 2 వరకు వినియోగించిన విద్యుత్‌కు అయోమయానికి గురయ్యాడు.

సగటున నెలకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు బిల్లు వస్తుందని అశోక్ తెలిపారు. బిల్లుపై విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించగా పరిశీలించి కొత్త బిల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా జ‌రిగాయి. పూరి గుడిసెలో ఉండే వారికి కూడా వేల‌ల్లో క‌రెంట్‌ బిల్లులు వ‌చ్చాయి. దీంతో వారంతా అయోమ‌యానికి గురయ్యారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిల్లు రీడింగ్ మారి ఎక్కువగా వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

Next Story