ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆయన్ను తాడేప‌ల్లి స‌మీపంలోని మ‌ణిపాల్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆయ‌న గ‌త రెండురోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆదివారం నుంచి అనారోగ్యంగా ఉండ‌డంతో ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డ‌క‌పోవ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు.

కాగా.. ఇటీవల తమ్మినేని సీతారాం, ఆయన భార్యకు కరోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయ‌న అసెంబ్లీ స‌మావేశాల్లో కూడా పాల్గొన్నారు. మే 25న కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే.. క‌రోనా నుంచి కోలుకున్న సీతారాం ఆదివారం నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story