శబరిమలకు యాత్రికులకు రైల్వే శుభవార్త చెప్పింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. నవంబర్ 14 నుంచి జనవరి 21 మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. కాకినాడ టౌన్ - కొట్టాయం, కొట్టాయం - కాకినాడ టౌన్, నాందేడ్ - కొల్లామ్, కొల్లామ్ - నాందేడ్, చర్లపల్లి - కొల్లామ్, కొల్లామ్ - చర్లపల్లి మీదుగా 54 రైళ్లు నడపనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇవాళ ఉదయం 8 గంటల తర్వాత నుంచి ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్ ప్రారంభం కానుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. కాగా అంతకుముందు మచిలీపట్నం - కొల్లామ్, నర్సాపూర్ - కొల్లామ్, చర్లపల్లి - కొల్లామ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది.