సీఎం జగన్‌పై సింగర్‌ ట్వీట్‌.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

Singer Adnan Sami calls CM Jagan’s RRR Golden Globe tweet ‘separatist’. సోషల్ మీడియాలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై

By అంజి  Published on  12 Jan 2023 3:30 PM GMT
సీఎం జగన్‌పై సింగర్‌ ట్వీట్‌.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందన సందేశంపై గాయకుడు అద్నాన్ సమీ చేసిన వ్యాఖ్య వివాదానికి దారితీసింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న 'నాటు నాటు'తో 'తెలుగు జెండా రెపరెపలాడుతోంది' అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. దానికి బదులు 'భారత జెండా' అనే పదాన్ని ఉపయోగించాల్సి ఉందని అద్నాన్ సమీ స్పందించారు.

'తెలుగు జెండా' అనే పదబంధాన్ని ఉపయోగించి సీఎం జగన్ తన రాష్ట్రాన్ని దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వేరు చేయడానికి ప్రయత్నించారని, దీనికి 'వేర్పాటువాద' వైఖరి సరికాదని గాయకుడు చెప్పాడు. అతని ప్రతిస్పందనపై కొంతమంది ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు, వైసీపీ నాయకులు, అనేక మంది సోషల్ మీడియా నెటిజన్లు ఫైర్ అయ్యారు. వారు ప్రాంతీయ లేదా భాషా గుర్తింపుపై గర్వపడటం భారతీయుడిగా వారి గుర్తింపును తీసివేయదని వాదించారు.

''తెలుగు జెండా? భారత జెండా అని మీరు అనుకుంటున్నారా? మనం ముందుగా భారతీయులం, అందుకే.. మొదట మీరు భారత్ లోనే ప్రత్యేకమని ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా, మనది ఒకే దేశం! 1947లో మనం చూసినట్లుగా ఈ 'వేర్పాటువాద' వైఖరి అత్యంత అనారోగ్యకరమైనది!!! ధన్యవాదాలు…జై హింద్!" సీఎం జగన్ అభినందన సందేశంపై వ్యాఖ్యానిస్తూ'' అద్నాన్ సమీ ట్వీట్ చేశారు.

వైవిధ్యభరితమైన భారతీయ చలనచిత్రాలు భారతదేశం బయట ఎక్కువగా చూడబడుతున్నందున, ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భారతదేశం నుండి వచ్చిన తెలుగు చిత్రం, బాలీవుడ్ చిత్రం కాదు అని దర్శకుడు ఎస్ఎస్‌ రాజమౌళి స్వయంగా పదేపదే నొక్కిచెప్పినట్లు కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు ఎత్తి చూపారు.

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. ముఖ్యమంత్రి చేసిన తెలుగు గుర్తింపును రెట్టింపు చేస్తూ.. ''మన భాష, మన సంస్కృతి, మన గుర్తింపు గురించి మేము గర్విస్తున్నాము. నేను మళ్ళీ చెబుతున్నాను. మేము తెలుగు. @AdnanSamiLive, మీరు మా దేశభక్తిపై తీర్పు చెప్పే వారు కాదు. తెలుగువాడినన్న నా గర్వం భారతీయుడిగా నా గుర్తింపును దూరం చేయదు.'' అంటూ ట్వీట్‌ చేశారు.

రాష్ట్ర ఆరోగ్య మంత్రి విడదల రజినీ కూడా అద్నాన్ సమీ వ్యాఖ్యపై స్పందిస్తూ.. ''ఒకరి స్వంత గుర్తింపులో గర్వపడటం వారి దేశభక్తిని తగ్గించదు. ఒకరి మూలాన్ని గౌరవించడం వేర్పాటువాదాన్ని తెలియజేయదు. రెండింటినీ తికమక పెట్టుకోం. ట్విట్టర్‌లో అతిగా ఆలోచించే బదులు, మీరు భారతదేశానికి మరో #గోల్డెన్‌గ్లోబ్ @AdnanSamiLive కోసం కృషి చేయాలి.'' అంటూ ట్వీట్ చేశారు.








Next Story