నగరిలో రోజా పర్యటన.. ఊహించని సత్కారం
Shower flowers on MLA Roja. సినీ నటి, ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లాలోని తన నగరి నియోజకవర్గంలో పర్యటించారు.
By తోట వంశీ కుమార్Published on : 4 Aug 2021 6:15 PM IST
Next Story
సినీ నటి, ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లాలోని తన నగరి నియోజకవర్గంలో పర్యటించారు. వడమాలపేట మండలం తట్నేరి దళిత వాడ రోడ్డును రోజా ప్రారంభించారు. ఆసియన్ అభివృద్ధి బ్యాంకు ద్వారా రూ.43 లక్షల నిధులతో పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. జగనన్న కాలనీల గృహ నిర్మాణం కోసం నిరుపేదలైన లబ్దిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా ఒకొక్కరికి రూ.30 వేల వంతున ఎమ్మెల్యే రోజా పంపిణీ చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలకు కోసం వచ్చిన రోజాకు కృతజ్ఞతతో స్థానిక నాయకులు, ప్రజలు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. రోజా తలపై రోజా పూ రెమ్మలతో ముంచెత్తారు. నాయకులు, ప్రజల అభిమానానికి రోజా ఉబ్బి తబ్బిబయ్యారు. రోజాకు స్థానిక నాయకులు, కార్యకర్తలు రోజా పూలతో రోజాభిషేకం చేసి తమ అభిమానం చాటుకున్నారు. రోజా నెత్తిన తట్టలకొద్దీ పూలజల్లారు. వారి ప్రేమానురాగాలు, అభిమానానికి రోజా ఆనందంతో ఉండి పోయారు. ఈ ఘటన సినిమా సీన్‌ను తలపించింది.. వారి ప్రేమకు ఫిదా అయ్యానని రోజా చెప్పుకొచ్చారు.
గతంలో పుత్తూరు సుందరయ్య నగర్‌లో ఓ బోరు బావి ప్రారంభోత్సవానికి హాజరైన రోజాకు.. పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. రోజా రోడ్డుపై నడిచి వస్తుంటే.. రోడ్డుకు ఇరువైపులా జనాలు పూలు జల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు.