ఒంటరినయ్యా.. కన్నీరు ఆగనంటోంది : వైఎస్ షర్మిల
Sharmila Emotional tweet over YSR.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ కుటుంబ
By తోట వంశీ కుమార్ Published on 2 Sept 2021 1:11 PM ISTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో గురువారం నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం జగన్, విజయమ్మ, భారతి, షర్మిలతో పాటు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. వైఎస్ వర్థంతి సందర్భంగా ఆయన కుమారై, తెలంగాణ వైఎస్ఆర్‌టీపీ పార్టీ అధినేత షర్మిల చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 'ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. I Love & Miss U DAD' అని షర్మిల ట్వీట్ చేసింది.
ఒంటరి దానినైనా విజయం సాధించాలని,
— YS Sharmila (@realyssharmila) September 2, 2021
అవమానాలెదురైనా ఎదురీదాలని,
కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని,
ఎప్పుడూ ప్రేమనే పంచాలని,
నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి
నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు.
నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.
ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.
I Love & Miss U DAD
కాగా.. ఈ ట్వీట్ ఇప్పుడు హాట్‌టాఫిక్ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో షర్మిలకు విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే.. తాను ఒంటరిని అయ్యానని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పేశారని అంటున్నారు కొందరు. అసలు విషయం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా.. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.