దస్తగిరికి బెయిల్
గత 85 రోజుల నుంచి కడప జైలులో షేక్ దస్తగిరి రిమాండ్ ఖైదీ
By Medi Samrat Published on 24 Jan 2024 3:08 PM IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి, అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక కిడ్నాప్ కేసులో దస్తగిరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టులో దస్తగిరి తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
గత 85 రోజుల నుంచి కడప జైలులో షేక్ దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేయాలంటూ దస్తగిరి తరపున హైకోర్టులో న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది. దస్తగిరి తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. కిడ్నాప్ కేసులో దస్తగిరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఎన్నికల దృష్ట్యా దస్తగిరిపై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారని కోర్టులో వాదించారు.
Next Story