క్షుద్రపూజలు చేసిన వీడియోలను మహిళలకు పంపించి భయబ్రాంతులకు గురి చేస్తున్న మిరియాల రమణయ్య అనే వ్యక్తిని నెల్లూరు ఐదో నగర పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు బీవినగర్ చెందిన మనోరమను కొంతకాలంగా రమణయ్య వేధిస్తున్నాడు. తను చెప్పిన మాట వినకపోయినా.. డబ్బులు ఇవ్వకపోయినా.. చేతబడులు చేస్తాను. మీ కుటుంబాన్ని నాశనం చేస్తానని.. క్షుద్రపూజలు చేస్తానని బెదిరిస్తుండటంతో భయభ్రాంతులకు గురైన మనోరమ స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రమణయ్యను పోలీసులు అరెస్టు చేశారు.

మిరియాల వెంకటరమణయ్య రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షుడుగా చెలామణి అవుతున్నాడు. ఇనమడుగులోని తమ ఇంటిలో కోడిని కోసి కోడి రక్తంతో అమ్మ వారి పూజలు చేస్తూ దానిని వీడియో తీసి మహిళలకి పంపిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. దొంగ స్వామి అవతారమెత్తి.. నేనే శివుని అవతారం అంటూ.. మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుని కోడి రక్తం గుండెల మీద పూసుకొని.. కోడి రక్తంతో శివుడికి పూజ చేస్తూ.. ఇంట్లోనే రక్తం పారిస్తూ.. రకరకాల పూజలు చేస్తూ.. ఆ పూజలను చిత్రీకరించి మహిళలకి పంపిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.

ఎవరైనా తిరగబడి అడిగితే తాను ప్రముఖులతో తీయించు కున్న ఫొటోలను చూపించి బెదిరింపులకు పాల్పడుతు౦టాడు. ఇలా.. రమణయ్య ఇప్పటికే చాలా మంది మహిళలను బెదిరించి వారి వద్ద నుండి భారీగా డబ్బు లు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. రమణయ్య బారినుండి తమను రక్షించాలని బాధితులు కోరుతున్నారు.


సామ్రాట్

Next Story