మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షాక్‌.. షోకాజ్ నోటీసు జారీ

SEC Showcause Notice to Minister Kodali Nani.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2021 12:31 PM IST
SEC Showcase Notice to Minister Kodali Nani

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది. ఆయ‌న‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. మీడియా స‌మావేశంలో మంత్రి కొడాలి నాని ఎస్ఈసీని కించ‌ప‌రిచేలా మాట్లాడార‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు. తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కొడాలి నాని రాష్ట్ర ఎన్నిక ల క‌మిష‌న‌ర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

దీంతో.. మీడియాలో ప్రసారమైన ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 'క‌మిష‌న్ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా దురుద్దేశ ప్ర‌క‌ట‌న‌లు ఉన్నాయి. మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌క్ష‌ణ‌మే వివ‌రణ ఇవ్వాలి. వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయాలి. సాయంత్రం 5 గంట‌ల్లోగా మంత్రి స్వ‌యంగా గానీ లేక ప్ర‌తినిధి ద్వారా గాని వివ‌ర‌ణ ఇవ్వాల‌ని.. లేని ప‌క్షంలో చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని' షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.


Next Story