పల్నాడు జిల్లాలో స్కూల్‌ బస్సు బోల్తా

School Bus overturned in Palnadu District.విద్యార్థుల‌తో వెలుతున్న పాఠ‌శాల బ‌స్సు బోల్తా ప‌డింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2023 1:40 PM IST
పల్నాడు జిల్లాలో స్కూల్‌ బస్సు బోల్తా

విద్యార్థుల‌తో వెలుతున్న పాఠ‌శాల బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌నలో ప‌లువురు విద్యార్థుల‌కు గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న ప‌ల్నాడు జిల్లాలోని గుర‌జాల మండ‌లంలో శుక్ర‌వారం చోటు చేసుకుంది.

ఓ పాఠ‌శాల‌కు చెందిన బ‌స్సు విద్యార్థుల‌ను ఎక్కించుకుని దైద గ్రామం నుంచి గుర‌జాల‌కు వెలుతోంది. గంగవరం గ్రామ సమీపంలోని ఓ మ‌లుపు వ‌ద్ద స‌డ‌న్‌గా బైక్ రావ‌డంతో దాన్ని త‌ప్పించే క్ర‌మంలో బ‌స్సు రోడ్డు పక్క‌కు దూసుకువెళ్లి పంట‌పొలాల్లో బోల్తా ప‌డింది. వెంట‌నే స్పందించిన గ్రామస్తులు ప‌రుగున అక్క‌డ‌కు చేరుకున్నారు. విద్యార్థుల‌ను బ‌స్సుల్లోంచి బ‌య‌ట‌కు తీశారు. 10 మంది విద్యార్థుల‌కు స్వ‌ల్ప గాయాలు కాగా.. వారిని గుర‌జాల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు.

కాగా.. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 30 మంది విద్యార్థులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. విద్యార్థులు అంద‌రూ ప్ర‌మాదం నుంచి సురక్షితంగా బ‌య‌ట ప‌డ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

Next Story