మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

SC ST Atrocity case filed against EX Minister Prathipati Pulla Rao.తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2022 12:28 PM IST
మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది. కులం పేరుతో దూషించార‌ని ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిని ఫిర్యాదు మేర‌కు ప్ర‌త్తిపాటి పుల్లారావు సహా ఐదుగురిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు.

వివ‌రాల్లోకి వెళితే.. చిలకలూరిపేటలో మంచినీటి చెరువు దగ్గర ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభించేందుకు శుక్ర‌వారం మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అక్క‌డ‌కు వ‌చ్చారు. అయితే అందుకు అనుమతి లేదని పోలీసులు, మునిసిపల్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు,పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో త‌న‌ను కులం పేరుతో దూషించ‌డంతో పాటు నెట్టివేశార‌ని మున్సిప‌ల్ అధికారి సునీత పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్ర‌త్తిపాటి స‌హా ఐదుగురిపై వివిధ‌సెక్ష‌న్ల కింద‌పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా శ్రీనివాసరావు, ఏ5గా కరీముల్లాలను చేర్చారు.

Next Story