ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. 20 మందికి పైగా ప్ర‌యాణీకులు

RTC Bus Overturns in Singanamala.అనంత‌పురం జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2022 1:19 PM IST
ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. 20 మందికి పైగా ప్ర‌యాణీకులు

అనంత‌పురం జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. శింగ‌న‌మ‌ల మండ‌లం శింగ‌న‌మ‌ల నుంచి శోధ‌న‌ప‌ల్లికి బ‌స్సు వెలుతుండ‌గా.. శింగ‌న‌మ‌ల స‌మీపంలోకి రాగానే ఓ మ‌లుపు వ‌ద్ద స్టీరింగ్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ స‌మ‌యంలో బ‌స్సులో 20 మందికి పైగా ప్ర‌యాణీకులు ఉన్నారు. బ‌స్సు డ్రైవ‌ర్‌తో పాటు కొంద‌రు ప్ర‌యాణీకుల‌కు గాయాల‌య్యాయి.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌యాణీకులు మండిప‌డుతున్నారు. మంచి కండిష‌న్‌లో ఉన్న బ‌స్సుల‌నే న‌డ‌పాల‌ని, కాలం చెల్లిన బ‌స్సుల‌ను న‌డిపి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆడుకోవద్ద‌ని వారు కోరారు.

Next Story