రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులపై దుండగుల దాడి.. రూ.89 లక్షల నగదుతో పరార్‌

Robbers looted RS.89 lakh in cash from Nadikudi railway station. గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్‌లో దుండుగులు హల్‌చల్‌ చేశారు. సోమవారం రాత్రి స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న

By అంజి  Published on  8 March 2022 4:32 AM GMT
రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులపై దుండగుల దాడి.. రూ.89 లక్షల నగదుతో పరార్‌

గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్‌లో దుండుగులు హల్‌చల్‌ చేశారు. సోమవారం రాత్రి స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై దుండగులు దాడి చేసి 89 లక్షల రూపాయలు అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. దుర్గికి మండలానికి చెందిన అజయ్‌ కుమార్‌, ప్రకాశరావు, రామ శేషయ్యలు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నై వెళ్లేందుకు నడికుడి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. చెన్నెకి వెళ్లేందుకు టికెట్లు తీసుకుని రెండో ఫ్లాట్‌ఫాంలో ఎస్‌6 నంబర్‌ బోగీ ఆగే ప్రదేశం వద్ద నిల్చున్నారు. వారు తమతో పాటు రెండు బ్యాగులను కూడా తీసుకొచ్చారు.

అదే సమయంలో ఆరుగురు గుర్తు తెలియన వ్యక్తులు వారి వద్దకు వచ్చి పోలీసులు పిలుస్తున్నారని చెప్పారు. వారిని కొట్టుకుంటూ దూరంగా తీసుకెళ్లి రెండు బ్యాగులు తీసుకుని కారులో ఉడాయించారు. బ్యాగుల్లో రూ.89 లక్షలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ఈ విషయాన్ని బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు తెలిపారు. వ్యాపార పనుల కోసం రూ.89 లక్షల నగదును తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. పల్నాడు ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story