రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి ట్వీట్.. ఎవరి మీద చేస్తాడో తెలియని పరిస్థితి. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్ కు కోవిద్-19 పాజిటివ్ వచ్చినప్పుడు ట్వీట్ల మీద ట్వీట్లు చేశాడు వర్మ. హే పీకే ఫ్యాన్స్.. కరోనా వైరస్‌ను పచ్చడి చేసి చంపేయండి అంటూ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు.

ఇక నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడు ఆయన మీద, ఆయన కుమారుడు నారా లోకేష్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన సూక్ష్మ జీవి పట్టుకుందని సంచలన కామెంట్స్ చేశాడు. ఆ వైరస్ నివారణగా పనిచేసే ఏకైక టీకా ఉందని.. దాని పేరే తారక్9999(జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అఫీషియల్ ఖాతా) అని సూచించాడు. టీడీపీ కార్యకర్తలకు తన సలహా విని..తొందరగా తెలుగు దేశం పార్టీకి టీకా వేయండి అని సలహా ఇచ్చాడు. మీరందరూ ఆ వైరస్ బారిన పడి చచ్చిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు వర్మ. ఏపీ ఉన్నంత కాలం చంద్రబాబు ఉండాలని..రెండింటినీ విడదీసి చూడలేనని వర్మ మరో ట్వీట్ చేశాడు.

టీడీపీకి ప్రాణాంతక నారా లోకేష్‌ వైరస్‌ సోకిందని ట్వీట్‌ పెట్టిన రామ్ గోపాల్‌ వర్మ దానికి ఒకే ఒక్క వ్యాక్సిన్ ఉందని కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు. అది తారక్‌ (జూనియర్‌ ఎన్టీఆర్‌) మాత్రమేనని వర్మ ట్వీట్ చేశారు. టీడీపీ శ్రేణులు స్మార్ట్‌గా ఆలోచించాలని, తక్షణం జూనియర్‌ ఎన్టీఆర్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని కోరారు. లేకపోతే మీరు చచ్చిపోతారంటూ ట్వీట్ చేశారు.


సామ్రాట్

Next Story