ఏపీ ప్రజలకు శుభవార్త: కరోనా పరీక్షల ధరలు తగ్గింపు

Reduction of corona test prices .. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా పరీక్షలను తగ్గిస్తూ

By సుభాష్  Published on  13 Nov 2020 8:58 AM IST
ఏపీ ప్రజలకు శుభవార్త: కరోనా పరీక్షల ధరలు తగ్గింపు

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా పరీక్షలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ల్యాబ్‌లలో కోవిడ్ పరీక్షలకు వసూలు చేసే ధలను సవరించింది. ఎన్‌ఏబీఎల్‌, ఐసీఎంఆర్‌లు అనుమతించిన ప్రైవేటు ల్బారేటరీల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలను తగ్గించింది.

ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌ఎన్‌ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్‌ కిట్లు మార్కెట్‌లో పూర్తిగా అందుబాటులోకి రావడంతో పరీక్షల కోసం ఈ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం పంపించే నమూనాలకు రూ.800, వ్యక్తిగత పరీక్షలకు రూ.1000 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రైవేటు ల్యాబరేటరీలు ఈ ధరలను స్పష్టంగా అందరికి కనిపించేలా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Next Story