రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే రైల్వే.. పండుగల సీజన్ కావటంతో రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

By అంజి  Published on  30 Oct 2024 7:24 AM IST
Railway officials, queue lines, general coach , rush, passengers

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే రైల్వే.. పండుగల సీజన్ కావటంతో రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రద్దీగా ఉండే రైలు జనరల్‌ బోగీల్లో ఎక్కాలంటే ప్రయాణికులు యుద్ధం చేయాల్సిందే. తోపులాటలు, వాగ్వాదాలు, ఘర్షణలు సర్వసాధారణం. తాజాగా వీటికి చెక్‌ పెట్టేందుకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వ సిద్ధమైంది.

ప్రయాణికులు ప్రశాంతంగా రైలు ఎక్కేలా రైల్వే స్టేషన్లలో జనరల్‌ బోగీలు ఆగేచోట ప్లాట్‌ఫామ్‌లపై క్యూ లైన్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మొదట విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ప్రయాణికులు లైన్‌లో నిల్చొని తమ వంతు వచ్చినప్పుడు రైలు ఎక్కాల్సి ఉంటుంది. రద్దీ వేళల్లో జనరల్‌ బోగీల్లో ఎక్కేందుకు ప్రయత్నంచే క్రమంలో ప్రయాణికులు మధ్య జరిగే తోపులాట, వాగ్వాదాలకు తావు లేకుండా ఈ ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఈ విధానం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story