రాత్రివేళల్లో విశాఖ ఎయిర్‌పోర్టు మూసివేతపై కేంద్రానికి పురందేశ్వరి లేఖ

విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వే రాత్రి పూట మూసివేత కాల వ్యవధి అధికంగా ఉందని లేఖలో పేర్కొన్నారు పురందేశ్వరి.

By Srikanth Gundamalla  Published on  5 Aug 2023 1:18 AM GMT
Purandeswari, Letter, Central Govt, Vizag Airport,

రాత్రివేళల్లో విశాఖ ఎయిర్‌పోర్టు మూసివేతపై కేంద్రానికి పురందేశ్వరి లేఖ

విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఆధునీకరణ పనులు చేపడుతున్నారు అధికారులు. ఈ క్రమంలో రన్‌వేను రాత్రి వేళల్లో మూసివేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వే రాత్రి పూట మూసివేత కాల వ్యవధి అధికంగా ఉందని లేఖలో పేర్కొన్నారు పురందేశ్వరి. పదేళ్లకు ఒకసారి జరిగే ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల కోసం రాత్రి వేళ రన్‌వే మూసివేయాలని రక్షణ శాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దాంతో.. విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి.

అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంవటల వరకు ఎయిర్‌పోర్టు రన్‌వే మూసివేయాలని భావించింది. తూర్పు తీర నగరం విశాఖలో నేవీ కేంద్రం ఉండటంతో ఇక్కడి ఎయిర్‌ఓర్టును కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న విషయం అందరకీ తెలిసిందే. నవీకరణ పనులు దాదాపు ఐదారు నెలల పాటు సాగనున్నాయి. ఈ క్రమంలోనే పలు విమానాలకు అంతరాయం కలుగుతుందని పురందేశ్వరి స్పందిస్తూ కేంద్రానికి లేఖ రాశారు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు రన్‌వే సుందరీకరణ పనుల్లో బాగంగా మూసివేత వేళలు కుదించాలని రక్షణ మంత్రికి పురందేశ్వరికి లేఖలో విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ నిర్ణయం కారణంగా విశాఖ-సింగపూర్ విమానం సహా మరో 12 విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. దేశీయంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, పూణె నగరాలకు విమాన సేవలకు అంతరాయం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు పురందేశ్వరి. ఈ క్రమంలో విశాఖ ఆర్థిక వ్యవస్థతో పాటు పలు రకాల వాణిజ్యంపై ప్రభావం పడుతుందని తెలిపారు. అందుకే ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే..ఎయిర్‌పోర్టును రాత్రి 10.30 గంటల వరకు తెరిచే ఉంచాలని కోరారు. ఆ తర్వాత మూసివేసి.. మళ్లీ ఉదయం 6.30 గంటల నుంచి ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు నడిచేలా నిర్ణయం తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.


Next Story